»Andhra Pradesh Cm Ys Jagan To Visit Markapuram To Distribute Ysr Ebc Nestham Amount
YSR EBC Nestham: శుభవార్త.. నేడు ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15వేల జమ
నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham) కింద ఒక్కో అకౌంట్లో రూ.15వేల జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
YSR EBC Nestham: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అనే పథకాలను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham) కింద ఒక్కో అకౌంట్లో రూ.15వేల జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,39,068 మంది మహిళలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ అందించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి మార్కాపురం చేరుకుంటారు.
ముందుగా ఎస్వీకేపీ(SVKP) డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేస్తారు.. ఆ తర్వాత బటన్ నొక్కి.. ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, వెలమ, క్షత్రియులతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఈబీసీ(EBC)కి చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గడిచిన మూడేళ్లలో మొత్తం రూ. 45 వేల ఆర్థిక సాయం చేసింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మొత్తం రూ.1,257.04 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందించింది.