KDP: సుండుపల్లె MRO కార్యాలయ టైపిస్ట్ ప్రశాంత్ నాయక్ పై ఫోర్జరీ నమోదు చేసినట్లు SI శ్రీనివాసలు తెలిపారు. MRO మహబూబ్ చాంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. ఇటీవల తమ దృష్టికి తేకుండా టైపిస్ట్ ప్రశాంత్ నాయక్ ఇంటి నివేశ అనుబంధ పత్రాలు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా 27 మందికి నకిలీ ఇంటి నీవేశ అనుభవ పత్రాలు జారీ చేశారని తెలిపారు.