NLR: ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను గురువారం జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. రైతులకు నోటీసులు అందించి వారి సమక్షంలోనే రోవర్ సహాయంతో హద్దులు ఏర్పరచి రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టు ద్వారా ముదివర్తిపాలెం ఎంపికైందని తెలిపారు.