అన్నమయ్య: మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని శివాజీ నగర్లో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన మరమ్మత్తులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలను ఆదేశించారు.