VZM: టీబీ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా, తమ చాంబర్లో శనివారం దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.జీవన రాణి పాల్గొన్నారు.