కోనసీమ: ఆత్రేయపురం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 5 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ ఛైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణ రాజు తెలిపారు. 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు శ్రీవారి కళ్యాణం జరుగుతుందన్నారు. ఐదు రోజులు స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పలు వాహనాలపై స్వామివారి ఊరేగింపు జరగనున్నట్లు పేర్కొన్నారు.