SKLM: కంచిలి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మహా- 2.0 కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు అంగన్వాడీ కార్యకర్తలు తల్లిలా సేవలు అందిస్తున్నారని, వీరి సేవలు మరువ లేనివని అన్నారు.