VZM: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వేపాడ ఎస్సై సుదర్శన్ అన్నారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు మండలంలోని వీలుపర్తి పంచాయతీలో సర్పంచ్ అప్పారావు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.