GNTR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద డీజే సౌండ్స్‌ను అనుమతించేది లేదని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు శనివారం తెలిపారు.మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మండపాల వద్ద విలువైన వస్తువులు ఉంచకూడదని, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.