SKLM: ఆసుపత్రిలోని పేషెంట్లకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని సరఫరా చేసే కాంట్రాక్టరుకు జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి కె. వెంకటరత్నం సూచించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ అమరావతి ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్లకు సరఫరా చేసే ఆహారాన్ని శుక్రవారం ఆసుపత్రి డైటీషియన్ సమక్షంలో ఆయన పరిశీలించారు.