W.G: వీరవాసరం వైసీపీ మండల స్థాయి విస్తృత సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నౌడూరు జంక్షన్లోని పదాల వెంకమ్మ ఆలయం ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తెలిపారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, శాసన మండల చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల పాల్గొంటారని తెలిపారు.