SKLM: నరసన్నపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో శుక్రవారం నో స్మోకింగ్ జోన్ ప్రదర్శన కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాయుడు మాట్లాడుతూ.. పాఠశాల పరిసర ప్రాంతాలలో నో స్మోకింగ్ జోన్ చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.