పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జీ.శరభవరం గ్రామంలో బోడోజు మంగారావు (65) అనే వృద్ధుడు చలిమంటలో పడి తీవ్రంగా గాయపడ్డారు. గత అర్ధరాత్రి మంట కాచుకుంటుండగా ప్రమాదవశాత్తు మంటల్లో పడిపోవడంతో పాలిస్టర్ చొక్కా అంటుకుని 60% శరీరం కాలిపోయింది. ఈ ప్రమాదంలో వారి పాక కూడా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని జడ్డంగి పీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.