పల్నాడులోని ప్రసిద్ధి చెందిన ధర్మవరం శ్రీ హరిహర బాల నాగేంద్రస్వామి దేవస్థానంలో శివ ముక్కోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం నైవేద్య, నిరాజనాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు సుధాకర్ శాస్త్రి ఏర్పాట్లు పర్వేక్షించారు.