కడప: మాజీ సీఎం సొంత నియోజకవర్గంలోని వేంపల్లి, చక్రాయపేట మండలాలలో వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఈరోజు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. వేంపల్లి పట్టణంలోని వైసీపీ గెస్ట్ హౌస్లో మండల కన్వీనర్ చంద్రఓబుల్ రెడ్డి, జడ్పిటీసీ రవికుమార్ రెడ్డి, సర్పంచ్ ఆర్ శ్రీనివాసులు తదితరులు కేకు కట్ చేసి ఘనంగా వేడుకలు జరిపారు.