ATP: ఇటీవల ఆపరేషన్ చేయించుకుని హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్న అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సోమవారం గుత్తి మండల వైసీపీ నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి త్వరగా కోలుకోవాలని గుత్తి వైసీపీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.