అన్నమయ్య: మదనపల్లె కోర్టుకు బాంబు పెట్టినట్లు బెదిరింపు సమాచారం అందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సూచనలతో సీఐలు, ఎస్సైలు సిబ్బందితో కలిసి కోర్టు ఆవరణను ఖాళీ చేయించి, లాయర్లు-సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, హై అలర్ట్ ప్రకటించడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.