నంద్యాల జిల్లా శ్రీశైల (Srishailam) పుణ్యక్షేత్రానికి ఓ చిరుత మృతి కలకలర రేపింది. పాలధార పంచదార వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. పాలధార (Paladhara), పంచధార సమీపంలోని రహదారిపై రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గతంలో పలుమార్లు రాత్రి వేళలో భక్తులు (Devotees) స్థానికులకు చిరుత కంటపడింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుత కళేబరాన్ని సున్నిపెంట అటవీశాఖ కార్యాలయానికి (Forest office) తరలించారు. మృతి చెందినది ఆడ చిరుత అని, దాని వయసు సుమారు ఆరు నెలలు ఉంటుందని తెలిపారు. శ్రీశైలం వైపు వెళ్లే వాహనం ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు నిత్యం సంచరిస్తుంటాయి. రాత్రి వేళల్లో రోడ్లు దాటుతూ పలుమార్లు స్థానికులు, వాహనదారుల కంటపడ్డాయి. దీంతో భక్తులు భయాందోళకు గురివుతున్నారు.