ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సీఐ మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఎస్సైలు మహమ్మద్ రఫీ, సురేష్‌లు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొరిసపాడు పోలీస్ స్టేషన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహమ్మద్ మెయిన్ పాల్గొని హెల్మెట్ యొక్క ఆవశ్యకతను స్థానిక ప్రజలకు వివరించారు.