ASR: డుంబ్రిగూడలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్లకోమా కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే వ్యాధి అని వైద్యులు తెలిపారు. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే శాశ్వత అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు, ఆశా కార్యకర్తలకు గ్లకోమా లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు.