TPT: పుత్తూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలలుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో మహిళలు, పేషంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెడికల్ ఆఫీసర్ డా. చంద్రశేఖర్ ఈ విషయం గురించి నగరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్‌కు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నగరి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిప్యూటీ సివిల్ సర్జన్ డా. జరీనాను డిప్యుటేషన్‌పై ఆసుపత్రికి పంపించారు.