NZB: మోస్రా మండల శివారులో గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ చోరీ చేసి అందులో ఉన్న కాపర్‌ను దొంగలించిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రైతులు శంకర్, నరేందర్, గంగాధర్ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.