తూ.గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా గురువారం కొనసాగింది. బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు, నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.