ATP: అనంతపురంలో కొత్త మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్) పాలిక్లినిక్ భవనాన్ని మేజర్ జనరల్ అజయ్ మిశ్రా శనివారం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మాజీ సైనికులు, కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆధునిక రోగ నిర్ధారణ కేంద్రాలు, ప్రత్యేక చికిత్సా విభాగాలు, పునరావాస కార్యక్రమాలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.