CTR: సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉషాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీసిటీకి చెందిన డైకిన్ ఎయిర్ కండిషన్,పేనాసోనిక్, బ్లూఓసిన్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన 18 నుంచి 25ఏళ్లలోపు వారు అర్హులన్నారు.