GNTR: బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సంస్కారభారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన రంగవల్లులు, కళాకృతి తయారీ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు.