NLR: సంగం మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సోమ్లా నాయక్, ఎంపీడీఓ షాలెట్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.