AKP: ఈనెల 26న అచ్యుతాపురంలో జిల్లా ముఠా కార్మికుల మహాసభలు జరగనున్నాయని ముఠా సంఘం అధ్యక్షులు ఆర్.రాము తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ముఠా కార్మికుల సభలో తొలిసారిగా జరుగుతున్నాయని చెప్పారు. ముఠా కార్మికులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ మహాసభలో సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామన్నారు.