VZM: రాజాం మండలం గురువాం శ్రీఉమా రామలింగేశ్వరాలయంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. 20 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించారు. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ సూర్య కిరణాలు శివలింగాన్ని తాకలేదని ఈరోజు ఆ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని భక్తులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. శివలింగాన్ని దర్శించుకోడానికి భక్తులు తరలి వస్తున్నారు.