ASR: అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే.పుష్పరాజు అధ్యక్షతన జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కాలుష్య నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. అనంతరం వివిధ రకాల కాలుష్యాల గురించి వివరించారు.