గుంటూరు: జిల్లాలో రాబోయే 10 తరగతి పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించటానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు DEO రేణుక తెలిపారు. నవంబర్ నుండి ప్రతి విద్యార్థిపై దృష్టి కేంద్రీకరించి, వారి పరీక్షల సన్నద్ధతకు తోడ్పాటు అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. వెనుకబడిన విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల కోసం ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నామన్నారు.