VZM: చీపురుపల్లి మండలంలోని పుర్రేయవలస గ్రామంలో వెలసిన శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో అభిషేకాలు చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.