అన్నమయ్య: నేటి యువత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు. గురువారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణ కేంద్రంలోని ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచానికి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ అన్నారు.