KKD: పెదపూడి మండలం సంపరలో మంగళవారం రైతులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పవర్ టిల్లర్లను పంపిణీ చేశారు. వ్యవసాయరంగా అభివృద్ధి, రైతుల సంకేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కూటమి నేతలు, అధికారులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు.