GNTR: పొన్నూరులో 30 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలో 10 మందికి రూ. 6,72,812, మండలంలో 20 మందికి రూ.10,54,830 విలువైన చెక్కులు అందించారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.