KRNL: జాతర ముగియడంతో పాఠశాల విద్యార్థులతోపాటు కుటుంబ సమేతంగా వలస బాట పట్టారు. ఆదోని మండలం పాండవగల్లు గ్రామానికి చెందిన కూలీలు గత వారం రోజుల కిందట గ్రామంలో ఆంజనేయ స్వామి జాతరకు వచ్చారు. పండగ పూర్తి కావడం, ఊళ్లో పనులు లేకపోవడంతో పిల్లాపాపలతో కర్ణాటక రాష్ట్రంలోని వాడి ప్రాంతానికి పత్తి పనులకు వెళ్తూ మంత్రాలయం మీదుగా వెళ్తున్నారు.