KRNL: ఆదోనిలో వెలసిన శ్రీ గంగాభవాని దేవాలయంలో గంగామాతకు అర్చకులు సత్యనారాయణ స్వామి, మధుసూదన్ రావు ఘనంగా పాలాభిషేకం బుధవారం నిర్వహించారు. అనంతరం దేవిని పుష్పాలతో, ఆభరణాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగామాతను దర్శించుకున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.