ELR: నూజివీడు మండలం మీర్జాపురంలోని ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్‌ను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న శనివారం తనిఖీ చేశారు. స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక నిల్వ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక స్టాక్ పాయింట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించాలన్నారు. అంత కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.