అన్నమయ్య: గాలివీడు మండల పరిధిలోని ప్రభుత్వ భూములను స్వాధీనపరచాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన ఆయన, గాలివీడు టౌన్‌లోని సర్వే నంబర్ 475, 477ల్లో కొంత భూమిని షేక్ నసీబ్ జాన్ అక్రమంగా కబ్జా చేసిందని, దీనికి పోరెడ్డి రమణారెడ్డి అండగా ఉన్నారని ఆరోపించారు.