SKLM: ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక కరుణ సమాజంలో రెడ్ క్రాస్ సంస్థ అప్ హోల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.