కృష్ణా: గన్నవరం పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి కోసమే ఏసుక్రీస్తు తాను సిలువను మోసారని పేర్కొన్నారు. ప్రేమ, దయ, మంచితనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.