VZM: బొబ్బిలి సబ్ జైలులోని సౌకర్యాలను గురువారం కోస్తాంధ్ర జైళ్లశాఖ డీఐజీ ఎమ్మార్ రవికిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఉపకారాగారం శిథిలావస్థకు చేరుకుందని, ఎరకన్నదొరవలస వద్ద కొత్త జైలు నిర్మాణానికి హైకోర్టు సూచనల మేరకు రెవెన్యూ ఐదెకరాలు చూపించారని చెప్పారు. జిల్లా జైలర్ శివప్రసాద్, సూపరింటెండెంటు సీతారామ పాత్రో పాల్గొన్నారు.