NLR: అల్లూరు మండలంలోని ఇసుకపల్లి సముద్రతీర ప్రాంగణంలో కనుమ పండుగ రోజు నలుగురు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు మృతదేహాలు బయటికి వచ్చాయి. నాలుగో మృతదేహం మంగళవారం ఉదయం బోగోలు మండలంలోని పాత-కడపాళెం సమూద్రతీరానికి కొట్టుకు వచ్చింది. కాగా, సంఘటన జరిగిన ఐదవ రోజుకు మృతదేహం లభ్యమయినట్లు స్థానికులు తెలిపారు.