KDP: కడప కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్గా 41వ డివిజన్ కార్పొరేటర్ ముంతాజ్ బేగం ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తారు. సాయంత్రం 4గంటలకు మేయర్ ఛాంబర్లో ఆమె ఇన్ఛార్జ్ మేయర్గా సంతకం చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పలు అధికారులు చేశారు. మేయర్ సురేశ్ బాబును రాష్ట్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.