NTR: పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఐదవ డివిజనుకు చెందిన డీ.గిరిజకు రూ.2,50,000, కృష్ణలంకకు చెందిన పీ.శశికుమారుకు రూ.10 లక్షలు సీఎంఆర్ఎఫ్ (CMRF) ఎల్.వో.సీ. చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందచేశారు.