SKLM: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తప్పనిసరిగా హోంవర్క్ అందించాలని ఎంఈవో 2 ఎం వర ప్రసాద్ రావు ఆదేశించారు. శుక్రవారం జలుమూరు మండలం ఈదులవలస పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల వర్క్ బుక్కులను, హోంవర్క్లను ఆయన పరిశీలించి తగు సూచనలు అందజేశారు. రీడింగ్, డిక్టేషన్ ప్రతిరోజు నిర్వహించాలని ప్రాథమిక స్థాయి నుండి దీనిని ఒక అలవాటుగా చేయాలన్నారు.