తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అర్జీలను స్వీకరించారు.