NTR: వత్సవాయి(మం) పోలంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్‌ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.