SKLM: ఈనెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖలో 5 రోజుల పాటు జరిగే CITU అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా రణస్థలం CITU కార్యాలయంలో అఖిల భారత మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి అన్నారు.