KRNL: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలోని హంద్రీ నది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను వీఆర్వో పాండురంగయ్య పట్టుకున్నారు. ట్రాక్టర్ను పోలీసులకు అప్పగించగా, డ్రైవర్ పరారైనట్లు ఎస్సై ఎర్రిస్వామి గురువారం తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.